నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాల మేరకు, నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఆదివారం నంద్యాల, ఆత్మకూరు సబ్ డివిజన్‌లలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. దేవనగర్, వెంగల్‌రెడ్డి నగర్, కురుకుంద, శాంతానకోట గ్రామాల్లో జరిగిన ఈ సోదాల్లో, ధృవపత్రాలు లేని 13 బైక్‌లు, ఒక స్కోడా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.