నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం దేవ నగర్ ప్రాథమిక పాఠశాలలో జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జెఎస్ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నీటి ప్రాముఖ్యత, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సదస్సు నిర్వహించారు. బ్రహ్మానంద చారి మాట్లాడుతూ, నీరే జీవనాధారమని, నీటిని పొదుపుగా వాడాలని, ఇంకుడు గుంతలు నిర్మించాలని, వ్యవసాయంలో బిందు సేద్యం అలవాటు చేసుకోవాలని సూచించారు. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పక్షులు, జంతువులకు నీటిని అందించాలని కోరారు.