వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే

14చూసినవారు
వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే
బనగానపల్లె వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబుల్ రెడ్డి "వెన్నుపోటుకు రెండేళ్లు" పోస్టర్‌ను విడుదల చేశారు. జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మహానాడులో రాష్ట్ర అభివృద్ధిపై చర్చ లేకుండా వైఎస్ జగన్‌పై విమర్శలకే పరిమితమయ్యారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, కొత్త పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీల అమలుపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్