శ్రీశైలం దేవస్థానం డిసెంబర్ 1 నుంచి భక్తుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 500 టికెట్‌తో మల్లన్న స్పర్శ దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి రెండు లడ్డూలు ఉచితంగా అందజేయనున్నట్లు ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ రమేశ్ నాయుడు తెలిపారు. అలాగే, రూ. 300 టికెట్‌తో అలంకారం దర్శనం చేసుకునేవారికి 100 గ్రాముల లడ్డూ ఇవ్వనున్నారు. దేవస్థానం బోర్డు సమావేశంలో 14 అంశాలు చర్చించగా, వాటిలో 11 అంశాలకు ఆమోదం లభించింది.