శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి బుధవారం చెంచుగిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. ఈ నెల చివరి బుధవారం నాడు చెంచు భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పల్నాడు, మార్కాపురం ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. సంప్రదాయ తప్పెట వాయిద్యాలు, చెంచు నృత్యాలతో ఆలయానికి చేరుకున్న భక్తులకు దేవస్థాన సిబ్బంది ఘన స్వాగతం పలికారు.