ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్తులకు అధికారులు కీలక ప్రకటన జారీ చేశారు. స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. జులై 15 నుంచి 19 వరకు స్పర్శ దర్శనానికి అనుమతి లేదని తెలిపారు. శ్రీశైల గేట్లు తెరవడంతో పర్యాటకుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం తెలిపారు.