నంద్యాలలో శనివారం రాయలసీమ సాగునీటి సాధన సమితి సమావేశంలో అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రం అక్టోబర్ 1, 1953న ఏర్పడిందని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినాన్ని విస్మరించి నవంబర్ 1న కార్యక్రమాలు నిర్వహించడం చరిత్రను వక్రీకరించే చర్య అని పేర్కొన్నారు. ఇప్పటికైనా చారిత్రక సత్యాన్ని గౌరవిస్తూ అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర దినోత్సవం జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.