గురువారం కొలిమిగుండ్ల బస్టాండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. చెర్లోపల్లికి చెందిన దారం దేవ భూషణ్ బనగానపల్లె బస్సు ఎక్కుతుండగా కిందపడిపోయి మృతి చెందారు. స్థానికులు, ప్రయాణికులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఘటనతో బస్టాండ్ ఆవరణలో విషాద వాతావరణం నెలకొంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.