ప్రజలందరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని గాజులపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్. వెంకట రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు ప్రబలకుండా ఇంటి పరిసరాల్లోని తొట్టెలు, నీటి డ్రమ్ములు, టైర్లు, ప్లాస్టిక్ డబ్బాల్లో నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలన్నారు.