కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం సాయంత్రం 6:30 గంటలకు మహానంది క్షేత్రంలో జ్వాలాతోరణం, కోటీ దీపోత్సవం కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆలయ ఈవో ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.