బండిఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన చాకలి గోకారి (42) ఆదివారం ఉప్పాగు కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. బట్టలు ఉతకడానికి వెళ్లిన గోకారి జారి నీటిలో పడిపోయారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.