శ్రీశైల దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, ఉగాది మహోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి పాదయాత్రకు అనుమతి ఉంది. వెంకటాపురం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు భక్తుల సౌకర్యార్థం అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 16 నుంచి 20 వరకు జరిగే ఈ ఉత్సవాలకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని అంచనా.