వెలుగోడులో ఈదురుగాలులతో వర్షం.. విద్యుత్ అంతరాయం

3చూసినవారు
మంగళవారం వెలుగోడు మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులకు ఇందిరానగర్‌లో విద్యుత్ స్తంభం, పురాతన చెట్టు విరిగిపడటంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. వర్షం కారణంగా వాతావరణం చల్లబడి, ఎండల తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి అధికారులు త్వరగా మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :