గాజులపల్లెలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వరి, మొక్కజొన్న పంటలను కల్లాల్లో, రోడ్ల పక్కన ఆరబెట్టిన రైతులు టార్పాలిన్ కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. అరటి రైతులు నష్టాల భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు వేడి నుంచి ఉపశమనం లభించినా, ఈదురు గాలుల వల్ల పంట నష్టంపై ఆందోళన నెలకొంది. అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.