శ్రీగిరిపై సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

7చూసినవారు
శ్రీగిరిపై సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నిక దీక్షతో ఏడురోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజూ స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవాలయాల్లో పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్