వైసీపీ కార్యాలయంపై దాడిని ఖండించిన శిల్పా చక్రపాణిరెడ్డి

11చూసినవారు
ఆత్మకూరులో వైసీపీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనను మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి ఘటనలు సమంజసం కాదన్నారు. చిల్లర పనులు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.