శ్రీశైల దేవస్థానం, చెంచు గిరిజనుల కోసం నెలకు ఒకరోజు ప్రత్యేక ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, బుధవారం చెంచు భక్తులకు స్వామివారి స్పర్శదర్శనం కల్పించారు. గిరిజనులు మల్లన్నను స్పర్శించి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం, దేవస్థానం తరఫున అన్నపూర్ణ భవనంలో అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ నిర్ణయంపై చెంచు భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.