శ్రీశైలం దేవస్థానం క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ రమేశ్ నాయుడు ఆదేశించారు. మంగళవారం జరిగిన 7వ ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈవో శ్రీనివాసరావు, బోర్డు సభ్యులు హాజరైన ఈ సమావేశంలో మొత్తం ఆరు అంశాలపై చర్చించారు. వీటిలో రెండు అంశాలకు ఆమోదం లభించగా, రెండు వాయిదా పడ్డాయి. మరో రెండు అంశాలను బోర్డు తిరస్కరించింది.