Jan 27, 2026, 01:01 IST/
పిల్లల్లోనూ డయాబెటిస్: కారణాలు, లక్షణాలు, చికిత్స
Jan 27, 2026, 01:01 IST
డయాబెటిస్ కేవలం పెద్దలకే పరిమితం కాదని, పుట్టిన పిల్లలను కూడా ఇది ప్రభావితం చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. టైప్-1 డయాబెటిస్ అరుదుగా తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది. పుట్టుకతోనే ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల 5-15 ఏళ్లలోపు పిల్లల్లో లక్షణాలు బయటపడతాయి. పెద్దవారిలో 60% యాక్సిడెంటల్‌గా, 40% లక్షణాల ఆధారంగా వ్యాధి నిర్ధారణ అవుతుంది. చక్కెర పదార్థాలు పెరగడం వల్ల మధుమేహం వస్తుంది. టైప్-1 ఆటో ఇమ్యూన్ వ్యాధి కాగా, టైప్-2 జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. అధిక దాహం, ఆకలి, పదే పదే మూత్రవిసర్జన, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్సలో ఇన్సులిన్ ఇంజెక్షన్లు, గ్లూకోజ్ మానిటరింగ్, ఇన్సులిన్ పంప్స్, ప్యాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉన్నాయి. పిల్లల్లో టైప్-1 డయాబెటిస్ నిర్ధారణ అయితే ఆందోళన చెందకుండా కౌన్సిలింగ్, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు అవసరం.