
నంద్యాల జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీస్ కౌన్సెలింగ్
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాల మేరకు, ఆదివారం జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో నివసిస్తున్న రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగినవారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించమని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండమని హెచ్చరించారు. వారి జీవనోపాధి, వృత్తులపై ఆరా తీసి, చట్టానికి మించి నడిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.






































