
మహానంది: రామ రామా... ఇదెక్కడి చోద్యం.!
శివ కేశవులకు నిలయం మహానంది ఆలయం. అయితే భక్తులకు శ్రీ సీతారాముల వారి దర్శనం కరవైంది. శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర దర్శనం అనంతరం రామాలయం వెళ్లడం అనవాయితీ. అయితే ఎన్నడూ లేని విధంగా రద్దీ పేరుతో సీతారాముల వారి దర్శనాన్ని భక్తులకు దూరం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంపై ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ‘అంతా నా ఇష్టం’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.





































