సిరాలదొడ్డిలో జూన్ 5న అంబేద్కర్ విగ్రహావిష్కరణ

5చూసినవారు
సిరాలదొడ్డిలో జూన్ 5న అంబేద్కర్ విగ్రహావిష్కరణ
ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డి గ్రామంలో జూన్ 5న ఉదయం 10 గంటలకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జి. ఆనంద్ చైతన్య మాదిగ, దళిత రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అరెకంటి భాస్కర్, కెవిపిఎస్ మండల అధ్యక్షులు సప్పోగు తిమ్మన్న తెలిపారు. ఆదివారం అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఎమ్మిగనూరు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కెవిపిఎస్, ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, దరసం, ఏఐసిసి తదితర దళిత ప్రజా సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్