
టెన్త్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు చంద్రబాబు శుభాకాంక్షలు
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 85.25 శాతానికి పెరిగింది, ఇది గత ఏడాది 81.1 శాతం కంటే ఎక్కువ. బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే 5.22 శాతం అధికంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 78.39 శాతానికి పెరగడం స్ఫూర్తిదాయకం. విద్యాశాఖ మంత్రి లోకేష్, అధికారులను, ఉపాధ్యాయులను సీఎం అభినందించారు. పిల్లల్లో నైతిక విలువలు, సమగ్ర విద్యా వికాసానికి విద్యాశాఖ కృషిని కొనసాగించాలని కోరారు.




