మంగళవారం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నపిల్లల, గైనిక్, ఆప్తమాలజీ, రేడియాలజీ, ఎమర్జెన్సీ విభాగాలను పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు, భోజనం, పరిశుభ్రత, సిబ్బంది ప్రవర్తనపై సంతృప్తి వ్యక్తం చేశారు. నెలకు 11,000 ఓపీ, 1,300 ఐపీ రికార్డులు, 293 ప్రసవాల్లో సిజేరియన్ శాతం తగ్గించే సూచనలు కూడా చేశారు.