గంజహళ్లికి బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాగునీటి సరఫరా

2చూసినవారు
గంజహళ్లికి బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాగునీటి సరఫరా
గోనెగండ్ల మండలం గంజహళ్లిలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాగునీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టారు. మంగళవారం, గ్రామస్తులు వడ్ల నరసింహ ఆచారి, దాసన్నగారి రమేష్ ఈ సమస్యను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సమస్యలకు స్పందించి, ఆమె వెంటనే ఈ విషయాన్ని బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ దృష్టికి తీసుకెళ్లారు.
Job Suitcase

Jobs near you