కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేసింది. బుధవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, మద్యం తాగి వాహనం నడిపేవారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణను కూడా కట్టుదిట్టం చేశారు.