రాష్ట్రంలో చేపడుతున్న కులగణన సర్వేలో దళిత, గిరిజనుల వివరాలను తప్పుగా నమోదు చేస్తే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ హెచ్చరించారు. గురువారం కర్నూలు టౌన్‌లోని జై భీమ్ ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కోసం గత 30 ఏళ్లుగా అనేక ఉద్యమాలు జరిగాయని, ఎంతోమంది త్యాగాల ఫలితంగా 2024లో వర్గీకరణ సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.