ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద ఆటో-టెంపో ట్రావెల్ ఢీకొన్న దుర్ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. తీవ్రంగా గాయపడిన చాకలి సరస్వతి (28) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది కూలీలకు స్వల్ప గాయాలు కాగా, నలుగురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని స్థానికులు తెలిపారు.