ఎమ్మిగనూరు: అయేషా మీరా కేసు తీర్పు పునరాలోచించాలి

10చూసినవారు
ఎమ్మిగనూరు: అయేషా మీరా కేసు తీర్పు పునరాలోచించాలి
2007 డిసెంబర్ 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అయేషా మీరా హత్య కేసుపై సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రతినిధి రంగయ్య స్పందించారు. శుక్రవారం ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడుతూ, సుప్రీం కోర్టు తీర్పును పునరాలోచించాలని, బాధితురాలికి పూర్తి న్యాయం జరగలేదని, అసలు నిందితులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో న్యాయవ్యవస్థ వ్యవహారశైలిపై ప్రశ్నలు లేవనెత్తుతూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్