కర్నూలు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఆదివారం పోలీసులు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టారు. నేరచరిత్ర గల వ్యక్తులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి, సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.