ఎమ్మిగనూరు హుస్సేనప్ప కాలనీలో భూ వివాదంపై మునిసిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహమ్మద్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు కామర్తి నాగేశప్ప, సోషల్ మీడియా అధ్యక్షుడు షరీఫ్ స్పందించారు. బాధితురాలు ముక్కరమ్మకు చట్టబద్ధ హక్కులు దక్కే వరకు రాజ్యాంగబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఎస్సీ వర్గాల పట్టా భూములపై కబ్జా చేశామనే ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. భూ వివాదంపై తహసీల్దార్, రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదులు సమర్పించామని, విచారణకు సహకరిస్తామని పేర్కొన్నారు.