గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గ్రామ సంఘ సహాయకులకు 5జీ సదుపాయం కలిగిన స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు. సోమవారం ఎమ్మిగనూరులోని ఆర్ంఅడ్బి గెస్ట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఈ స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామ సంఘ సహాయకులను డిజిటల్‌గా శక్తివంతం చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 28,500 స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ స్థాయిలో సేవల అందజేతను మరింత సమర్థవంతంగా, వేగంగా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.