కర్నూలు జిల్లాలో అధిక వర్షాల వల్ల ఖరీఫ్ పంటలు నష్టపోయిన రైతులకు రబి సీజన్‌లో ఎల్‌ఎల్‌సీకి నీరు విడుదలచేసి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరికి మంగళవారం టిడిపి నాయకులు వినతిపత్రం అందజేశారు. కర్నూలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి, టిడిపి నేత మీనాక్షి నాయుడు తదితరులు కలెక్టర్‌ను కలిసి ఈ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘాల అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు కూడా పాల్గొన్నారు.