ఎమ్మిగనూరు: లడ్డూ అంశంపై అసెంబ్లీలో పూర్తి చర్చ జరపాలి

5చూసినవారు
ఎమ్మిగనూరు: లడ్డూ అంశంపై అసెంబ్లీలో పూర్తి చర్చ జరపాలి
తిరుపతి లడ్డూ కల్తీ వంటి సున్నితమైన అంశంపై అసెంబ్లీ కౌన్సిల్‌లో పూర్తిస్థాయి చర్చ జరగాలని ప్రతిపక్షం పట్టుబడుతున్నా, కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చర్చను తప్పించుకుంటోందని ఎమ్మిగనూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు నిజాలు తెలియకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రైతుల మద్దతు ధరలు, నిరుద్యోగం, పెన్షన్, ఫీజు బకాయిలపై స్పష్టత ఇవ్వాలని, ప్రచార ఖర్చులు తగ్గించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్