ఎమ్మిగనూరు: మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

3158చూసినవారు
ఎమ్మిగనూరు: మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
ఆదివారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గుడేకల్లు గ్రామంలో మహిళల భద్రత, బాల్య వివాహాల నిర్మూలన, బాలికల విద్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ చిరంజీవి మాట్లాడుతూ మహిళలపై వేధింపులు, హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, అవి బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాసులు, శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు.