ఎమ్మిగనూరులో ఇన్నోవా కారు దొంగల ముఠా అరెస్ట్‌

5చూసినవారు
ఎమ్మిగనూరులో ఇన్నోవా కారు దొంగల ముఠా అరెస్ట్‌
ఎమ్మిగనూరు పట్టణంలో జనవరి నెలలో నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎత్తుకెళ్లిన ఇన్నోవా క్రిష్టా కారు దొంగలను గురువారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా కర్ణాటక, మహారాష్ట్ర పోలీసుల సమన్వయంతో బీడ్‌ జిల్లాలో దొంగలను పట్టుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, డీఎస్పీ భార్గవి పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్