గోనెగండ్ల మండలంలో ప్రేమించిన యువకుడు పెళ్లి విషయాన్ని వాయిదా వేయడంతో మనస్తాపానికి గురైన ఓ మైనర్ బాలిక శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఓ గ్రామానికి చెందిన బాలిక తన సమీప బంధువైన యువకుడితో ప్రేమలో ఉంది. యువకుడి తండ్రి మృతి చెందడంతో పెళ్లిని వాయిదా వేయాలని యువకుడు కోరాడు. ఒత్తిడికి తట్టుకోలేక, జీవితంపై విరక్తి చెందిన బాలిక ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.