శుక్రవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం ఇబ్రహీంపురం గ్రామంలో ప్రకృతి వైపరీత్యం ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచింది. పొలానికి దున్నడానికి వెళ్లిన రైతు బోయ బెల్లం కృష్ణ, అకస్మాత్తుగా కురిసిన వర్షం నుంచి ఆశ్రయం కోసం చెట్టు కింద నిలవగా, భారీ గాలులకు చెట్టు కూలి తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్‌మోహన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.