కర్నూలు జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ రాజు శనివారం తెలిపారు. రైతులు మద్దతు ధరతో కందులను అమ్ముకోవాలని సూచించారు. సీఎం యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 5,379 మంది రైతులు నమోదు చేసుకున్నారు. 12 శాతం లోపు తేమ ఉన్న కందులను క్వింటాల్‌కు రూ. 8,000 మద్దతు ధరతో కొనుగోలు చేస్తారు. బస్తా 50 కిలోల చొప్పున తీసుకుంటారు.