ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన ఘనత జగన్‌కే దక్కుతుందని, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డును అపహస్యం చేసిన చరిత్ర కూడా జగన్‌దేనని ఆయన ఆరోపించారు. శనివారం పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.