కర్నూలు: దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

9చూసినవారు
కర్నూలు: దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2025–26 సంవత్సరానికి గాను విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. మొత్తం 27 గ్రూప్–4, 11 క్లాస్–4 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన దివ్యాంగులు నిర్దేశిత పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఖాళీలు, నమూనా దరఖాస్తు www.kurnool.ap.gov.in, www.nandyal.ap.gov.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్