ఎమ్మిగనూరులో సీపీఐ ఏపీ వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి నబీ రసూల్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, వీబీజీ రామ్ జి బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ వలసలను అరికట్టే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆయన అన్నారు. ఈనెల 10న కర్నూలులో జరగనున్న రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మిగనూరులో జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు.