ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, కర్నూలు జిల్లాలో జూన్ 5న నెట్ జీరో హెల్త్ క్యాంపస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. తొలి దశలో 13 విద్యాసంస్థల్లో 1625 మొక్కలు నాటాలని, సోలార్ ప్యానెల్లు, రైన్‌వాటర్ హార్వెస్టింగ్, కిచెన్ గార్డెన్లు, మియావాకి విధానంలో మొక్కల పెంపకం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులను ప్రకృతి పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని ఆమె పిలుపునిచ్చారు.