కర్నూలు: రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు

2చూసినవారు
కర్నూలు: రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. నేర ప్రవృత్తిని విడిచిపెట్టి, సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you