కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జిల్లాలోని చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులందరికీ రేషన్ సరుకులు నాణ్యతతో, సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో, రేషన్ పంపిణీలో అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రేషన్ సరుకుల నాణ్యత, పంపిణీ విధానంపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రతి నెల ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.