కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జలధార–జలహారతి కింద మంజూరైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వే, జలధార–జలహారతి, వీబీజీ రామ్ జీ పథకం కింద లేబర్ మొబిలైజేషన్, జనగణన తదితర అంశాలపై సమీక్షించారు. కొన్ని మండలాలు పనుల్లో వెనుకబడి ఉన్నాయని, చెక్ డ్యామ్‌లు, పెర్కోలేషన్ ట్యాంకుల మరమ్మతులకు అవసరమైన పనులను వెంటనే గుర్తించి వివరాలు పంపాలని సూచించారు.