ముగతి సమీపంలో లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

3చూసినవారు
ముగతి సమీపంలో లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం ముగతి సమీపంలో ఎన్హెచ్–167 జాతీయ రహదారిపై ఒక లారీ బోల్తా పడింది. యాదగిరి నుంచి చక్కర లోడ్‌తో ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న లారీ, ముందు వెళ్తున్న కారును తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు డ్రైవర్ తెలిపారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్