ముగతి: సహజ వనరులతో నేల ఆరోగ్యం కాపాడాలి

18చూసినవారు
ముగతి: సహజ వనరులతో నేల ఆరోగ్యం కాపాడాలి
నందవరం మండలం ముగతి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో మంగళవారం 'పొలం పిలుస్తుంది – భూమాత రక్షణ' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతులు అధిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, సహజ వనరులతో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని సూచించారు. అలాగే, సిసిఐ పత్తి కొనుగోలు మొదటి విడతలో 6 క్వింటాల వరకు, రెండవ విడతలో 4 క్వింటాల వరకు తేమశాతం ఆధారంగా జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్