ఎమ్మిగనూరులోని HBS కాలనీ బాలాజీ కన్‌స్ట్రక్షన్ భవనంలో పెయింటింగ్ పనులు చేస్తున్న పరమేశ్వర్ రెడ్డి (50) ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందారు. తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుడు మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందినవారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.