కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా సేవా ఆశ్రమంలో బుధవారం సాయంత్రం లక్షదీపార్చన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు సాయి సేవకులు సంజీవయ్య, సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏటా కార్తిక పౌర్ణమి రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమిదలతో కళాకారులచే బొమ్మలు వేయించి, వాటిపై ప్రమిదాలు వెలిగిస్తారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా పాల్గొంటారని ఆశించారు.